గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి

– ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు పంతం రవి
నవతెలంగాణ – సిరిసిల్ల
దశాబ్దల కాలంగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ హామీల పేరుతో దాటవేస్తుందని గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు హామీలను నెరవేర్చాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు పంతం రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సుభాష్ నగర్ లో గల కార్మిక భవనంలో ఏఐటీయూసీ అనుబంధ గ్రామపంచాయతీ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం రవి మాట్లాడుతూ గ్రామాల్లో నిత్యం ప్రజల అవసరాలు తీర్చే సఫాయి కార్మికులు కారోబార్లు ఎలక్ట్రిషన్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. ఈ కార్మికులు చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారని దశాబ్దాల కాలం నుండి గ్రామాల్లో పనిచేసినప్పటికీ కనీస వేతనాలు అమలు చేయడంలేదని ఈ సమస్యపై ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎన్నో ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు చేయడం జరిగిందని, పోరాటాల సమయంలో ప్రభుత్వం స్పందించి కనీస వేతనం 15,వేల 500 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, మొన్నటి మేడే రోజున వెయ్యి రూపాయలు పెంచడం చాలా సిగ్గుచేయడానికి ఆయన అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరల్లోకి అనుగుణంగా కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు గ్రామపంచాయతీ నుండి కాకుండా వారి వారి ఖాతాలో జమ చేయాలని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, అసిస్టెంట్ కార్యదర్శిగా గుర్తించి ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ సోమ నాగరాజు, కోకన్వీనర్ మల్యాల జాన్సన్, మీసంపల్లి లక్ష్మణ్, వడ్డేపల్లి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love