న్యూఢిల్లీ : వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం జార్ఖండ్ చేరుకున్నారు. ఆమె మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. రాంచీలో నిర్మించిన హైకోర్ట్ నూతన భవనాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. కుంతిలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ గురువారం నిర్వహించే మహిళా సదస్సులో పాల్గొంటారు. నుమ్‌కుమ్‌లో జరిగే రాంచీ ఐఐఐటీ రెండవ స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా హాజరవుతారు. ముర్ము గౌరవార్థం రాజ్‌భవన్‌లో జార్ఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే పౌర సన్మాన కార్యక్రమంలోనూ పాల్గొంటారు.