సంగీత పాఠశాల

సంగీత పాఠశాలకొన్ని పాటలు వింటూ ఉంటే లోకాన్ని మైమరిచిపోతూ ఉంటాం. మరికొన్నింటిని వింటే రక్తం ఉడికిపోతుంది. అందులోనూ తెలుగు సాహిత్యంతో మెళవించిన సంగీతలోకం గురించి ఎంత అభివర్ణించినా తక్కువే అవుతుంది. అలనాటి ఆపాతమధురాలు ఎంత హాయిగా ఉంటాయి? తెలుగు సినీ ప్రపంచంలో ఎంతో మంది సంగీత విద్వాంసులు ఈ సంగీతపూదోటలో ఎన్నో రకాల పుష్పాలను, ఇంకెన్నో కొత్త రకాల వంగడాలను సృష్టించారు.

సంగీతానికి రాళ్లు కరుగుతాయంటారు.. రాళ్లేమో కానీ మన మనసు మాత్రం ఇట్టే కరుగుతుంది. సంగీతానికి ఉండే శక్తి అటువంటింది. మనిషి మూడ్‌ను మార్చేసే శక్తి సంగీతానికి ఉందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. మనిషి జీవితంలో ఓ అంతర్భాగం సంగీతం. అన్ని సందర్భాల్లోనూ ఆయా భావాలను వ్యక్తం చేయడానికి సంగీతం ఒక వాహిక. మనసు బాగోలేకపోయినా.. ప్రశాంతత కరువైనా నచ్చిన పాటలు వింటే ఆ కిక్కేవేరు. ఇక అందరికీ అన్ని పాటలు నచ్చకపోవచ్చు. కొందరికి మెలొడి సాంగ్స్‌, మరికొందరికి విప్లవ పాటలు, ఇంకొందరికి మాంచి ఫాస్ట్‌ బీట్‌ మాస్‌ సాంగ్‌లు అంటే ఇష్టం. ప్రపంచంలో అనేక రకాల సంగీత సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో భారతీయ సంగీత సంప్రదాయాలకు చాలా విశిష్ట స్థానం ఉంది. భారతీయ సంగీతం రాగ ప్రధానమైనది అయితే పాశ్చాత్య సంగీతం స్వరమేళన ప్రధానం.
అయితే.. కొన్ని పాటలు వింటూ ఉంటే లోకాన్ని మైమరిచిపోతూ ఉంటాం. మరికొన్నింటిని వింటే రక్తం ఉడికిపోతుంది. అందులోనూ తెలుగు సాహిత్యంతో మేళవించిన సంగీతలోకం గురించి ఎంత అభివర్ణించినా తక్కువే అవుతుంది. అలనాటి ఆపాతమధురాలు ఎంత హాయిగా ఉంటాయి? తెలుగు సినీ ప్రపంచంలో ఎంతో మంది సంగీత విద్వాంసులు ఈ సంగీతపూదోటలో ఎన్నో రకాల పుష్పాలను, ఇంకెన్నో కొత్త రకాల వంగడాలను సృష్టించారు.
ఘంటసాల తన సృజనతో సృష్టించిన బాణీలు సంగీత ప్రపంచంలో నేటికీ పాఠాలే! నాటి పాటలు వింటూ ఉంటే.. అవి ఎప్పటికీ చెరిగిపోవు, గుర్తులుగా మిగిలిపోతాయి. వాటి గొప్పదనం అలాంటిది మరి. అన్నట్టు ఇవాళ ఘంటసాల మాస్టారి 50వ వర్థంతి.
”పగలే వెన్నెల జగమే ఊయలా” అంటూ ఘంటసాల పాట వింటూ ఉంటే నిజంగానే ఆ అనుభూతి కలుగుతుంది. ”రావోయి చందమామ ఈ వింత గాథ వినుమా..” అంటూ సావిత్రి, ఎన్టీఆర్‌లు పాడుకుంటూ ఉంటే తెలుగు ప్రేక్షకులు వారికి నీరాజనం పట్టారు. ”అంతా బ్రాంతియేనా..” ‘దేవదాస్‌’ చిత్రంలో పారు ఏడుస్తుంటే.. అందరీ కళ్లు చెమ్మగిల్లాయి. ”నా పాట నీ నోట పలకలా సిలకా..” అని నాగేశ్వరరావు ‘మూగమనుసులు’ సినిమాలో సావిత్రికి నేర్పిస్తుంటే.. ప్రేక్షకలోకం కూడా వంతపాడింది. ”నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది” అంటూ పాడితే.. కుర్రలోకం మత్తులో మునిగిపోయింది.
ఒక్కపాట ఓ జాతి మొత్తాన్ని కదిలించింది అంటే.. అది ఎంతటి ప్రభంజాన్ని సష్టించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో నిద్రాణమై ఉన్న జాతిని మేల్కొలిపేందుకు ”తెలుగు వీర లేవరా..” అంటూ గొంతెత్తితే వెండితెర దద్దరిల్లింది. ప్రేక్షకుల నాడీ వేగాన్ని, రక్తపు ప్రవాహవేగాన్ని పెంచిన పాటలెన్నో చిత్రప్రపంచంలో వచ్చాయి. అందులో అందరికీ సుపరిచితమైనవి, ఇప్పటికీ అవి అక్షరసత్యంగా నిలిచినవి సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించినవే. ‘సింధూరం’లో సినిమాలోని ”అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా..”, ‘గాయం’ చిత్రంలో ”నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..” అనే రెండు పాటలు అప్పటి సమాజాన్నే కాదు ఇప్పటి సమాజాన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నాయి.

Spread the love