న్యూఢిల్లీ : ప్రముఖ మేకప్ బ్రాండ్ అయిన స్విస్ బ్యూటీ తన బ్రాండ్ అంబాసీడర్‌గా బాలీవుడ్ నటీ తాప్సీ పన్నును నియమించుకున్నట్లు ప్రకటించింది. సంస్థ ప్రమాణాలను పునర్నిర్వచించడం, మెరుగైన మేకప్ ఎంపికలను చేసుకోవడంలో ప్రజలకు సహాయ పడటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. తాప్సీతో పాటుగా స్విస్ బ్యూటీ కూడా కిందిస్థాయి నుండి పైకి ఎదిగినందున ఈ సహకారం వినియోగదారులతో అనుబంధాన్ని మరింతగా పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.